టెన్త్ లో ‘ఇంగ్లిష్’ విద్యార్థుల హవా | english medium students increase in this year examsession | Sakshi
Sakshi News home page

టెన్త్ లో ‘ఇంగ్లిష్’ విద్యార్థుల హవా

Mar 20 2016 7:37 AM | Updated on Sep 3 2017 8:08 PM

టెన్త్ లో ‘ఇంగ్లిష్’ విద్యార్థుల హవా

టెన్త్ లో ‘ఇంగ్లిష్’ విద్యార్థుల హవా

ఈసారి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల సంఖ్య పెరిగింది.

తెలుగు మీడియం కంటే ఇంగ్లిష్ మీడియం వారు 58,376 మంది అధికం
క్రమంగా తగ్గుతున్న తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్య
ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల్లోనే ఎక్కువ ఉత్తీర్ణత

 సాక్షి, హైదరాబాద్: ఈసారి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల సంఖ్య పెరిగింది. తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్యతో పోల్చితే ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసే విద్యార్థులు 50 వేల వరకు అధికంగా ఉన్నారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు 5,67,478 మంది హాజరు అవుతున్నారు. వారిలో రెగ్యులర్ విద్యార్థులు 5,21,046 మంది ఉండగా, 35,711 మంది ప్రైవేటు (వన్స్ ఫెయిల్డ్) విద్యార్థులు, 10,721 మంది ఓరియంటల్ ఎస్సెస్సీ, వొకేషనల్ విద్యార్థులు ఉన్నారు. ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసేందుకు 2,83,289 మంది, తెలుగు మీడియంలో పరీక్షలు రాసేందుకు 2,33,509 మంది దరఖాస్తు చేశారు.

ఇక గతేడాది కూడా తెలుగు మీడియం విద్యార్థుల కంటే ఇంగ్లిష్ మీడియం విద్యార్థులే ఎక్కువ మంది పరీక్షలు రాశారు. అంటే రాష్ట్రంలో క్రమంగా తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్య తగ్గి ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. గతేడాది ఉత్తీర్ణత శాతం ఇంగ్లిషు మీడియం విద్యార్థుల్లోనే ఎక్కువగా ఉంది. గతేడాది తెలుగు మీడియంలో పరీక్షలు రాసినవారిలో 1,79,221 మంది(73.32 శాతం) ఉత్తీర్ణులు కాగా, ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసిన వారిలో 2,11,281 మం (82.41 శాతం) ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థుల సంఖ్య పెరిగింది. గతేడాది  5,13,473 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా ఈసారి 5,21,046 మంది హాజరు కానున్నారు. ఈసారి రెగ్యులర్ విద్యార్థుల కోసం 2,427 కేంద్రాలు, ప్రైవేటు విద్యార్థుల కోసం 188 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement