breaking news
aggravated
-
పెద్దల మాదిరిగానే పదేళ్ల పిల్లలకూ జైలు శిక్షలు
క్వీన్స్‌ల్యాండ్: హత్య, తీవ్ర దాడి, దోపిడీల వంటి 13 నేరాలకు పాల్పడినట్లు రుజువైతే 10 ఏళ్ల బాలలకు సైతం పెద్దలకు మాదిరిగానే శిక్షలు వేసేందుకు ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్రం చట్టం చేసింది. హత్య నేరానికైతే కనీసం 20 ఏళ్లు ఎటువంటి పెరోల్ లేకుండా జీవితకాల జైలు శిక్ష పడే అవకాశముంది. గతంలో ఇది గరిష్టంగా పదేళ్లే ఉండేది. క్వీన్స్‌ల్యాండ్‌లో గత 14 ఏళ్లలో పిల్లల నేరాలు సగానికి సగం తగ్గినట్లు గణాంకాలు చెబుతు న్నాయి. 2022 నుంచి నేరాల రేటు స్థిరంగా కొనసా గుతోంది. అయితే, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే క్వీన్స్‌ల్యాండ్ జైళ్లలోనే ఎక్కువ మంది పిల్లలుండటం గమనార్హం. పిల్లలు కూడా నేరాలకు పాల్పడుతుండటంపై ప్రజాగ్రహం వ్యక్తమవు తున్నందు వల్లే చట్టాలను కఠినతరం చేశామని, దీనివల్ల నేరాలు తగ్గుతాయని ఆశిస్తు న్నామని ప్రభుత్వం అంటోంది. అయితే, నేరాలు తగ్గడం అంటుంచి పెరిగే ప్రమాదముందని నిపుణు లు ఆందోళన చెందుతున్నారు. ఇది చిన్నారుల మానవ హక్కులు, అంతర్జాతీయ చట్టాలకు భంగకరమని ఐరాస పేర్కొంది. -
టెన్త్ లో ‘ఇంగ్లిష్’ విద్యార్థుల హవా
♦ తెలుగు మీడియం కంటే ఇంగ్లిష్ మీడియం వారు 58,376 మంది అధికం ♦ క్రమంగా తగ్గుతున్న తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్య ♦ ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల్లోనే ఎక్కువ ఉత్తీర్ణత సాక్షి, హైదరాబాద్: ఈసారి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల సంఖ్య పెరిగింది. తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్యతో పోల్చితే ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసే విద్యార్థులు 50 వేల వరకు అధికంగా ఉన్నారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు 5,67,478 మంది హాజరు అవుతున్నారు. వారిలో రెగ్యులర్ విద్యార్థులు 5,21,046 మంది ఉండగా, 35,711 మంది ప్రైవేటు (వన్స్ ఫెయిల్డ్) విద్యార్థులు, 10,721 మంది ఓరియంటల్ ఎస్సెస్సీ, వొకేషనల్ విద్యార్థులు ఉన్నారు. ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసేందుకు 2,83,289 మంది, తెలుగు మీడియంలో పరీక్షలు రాసేందుకు 2,33,509 మంది దరఖాస్తు చేశారు. ఇక గతేడాది కూడా తెలుగు మీడియం విద్యార్థుల కంటే ఇంగ్లిష్ మీడియం విద్యార్థులే ఎక్కువ మంది పరీక్షలు రాశారు. అంటే రాష్ట్రంలో క్రమంగా తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్య తగ్గి ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. గతేడాది ఉత్తీర్ణత శాతం ఇంగ్లిషు మీడియం విద్యార్థుల్లోనే ఎక్కువగా ఉంది. గతేడాది తెలుగు మీడియంలో పరీక్షలు రాసినవారిలో 1,79,221 మంది(73.32 శాతం) ఉత్తీర్ణులు కాగా, ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసిన వారిలో 2,11,281 మం (82.41 శాతం) ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థుల సంఖ్య పెరిగింది. గతేడాది 5,13,473 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా ఈసారి 5,21,046 మంది హాజరు కానున్నారు. ఈసారి రెగ్యులర్ విద్యార్థుల కోసం 2,427 కేంద్రాలు, ప్రైవేటు విద్యార్థుల కోసం 188 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.