సుకుమార్ అసిస్టెంట్ విక్రమ్ దుర్మరణం! | Director Sukumar Asstitent director Vikram dead | Sakshi
Sakshi News home page

సుకుమార్ అసిస్టెంట్ విక్రమ్ దుర్మరణం!

Aug 22 2016 7:26 PM | Updated on Sep 4 2017 10:24 AM

సుకుమార్ అసిస్టెంట్ విక్రమ్ దుర్మరణం!

సుకుమార్ అసిస్టెంట్ విక్రమ్ దుర్మరణం!

ప్రముఖ దర్శకుడు సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ విక్రమ్ ప్రమాదవశాత్తూ దుర్మరణం చెందిన వార్త ఆలస్యంగా వెలుగు చూసింది.

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ విక్రమ్ అనుమానాస్పద స్థితిలో మృతి  చెందిన వార్త ఆలస్యంగా వెలుగు చూసింది. విక్రమ్ నిన్న రాత్రి ఓ భవనం పై నుంచి పడి మృతి చెందినట్లు సమాచారం. అతని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. విక్రమ్ మృతిపై అతని సోదరుడు కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

కాగా విక్రమ్ చాలా రోజులుగా సుకుమార్ వద్ద పని చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ చిత్రం 'నాన్నకు ప్రేమతో' చిత్రానికి విక్రమ్ అసిస్టెంట్గా పని చేశాడు. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement