breaking news
assistent director vikram dead
-
సుకుమార్ అసిస్టెంట్ విక్రమ్ దుర్మరణం!
-
సుకుమార్ అసిస్టెంట్ విక్రమ్ దుర్మరణం!
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ విక్రమ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వార్త ఆలస్యంగా వెలుగు చూసింది. విక్రమ్ నిన్న రాత్రి ఓ భవనం పై నుంచి పడి మృతి చెందినట్లు సమాచారం. అతని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. విక్రమ్ మృతిపై అతని సోదరుడు కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కాగా విక్రమ్ చాలా రోజులుగా సుకుమార్ వద్ద పని చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ చిత్రం 'నాన్నకు ప్రేమతో' చిత్రానికి విక్రమ్ అసిస్టెంట్‌గా పని చేశాడు. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.