తోపులాట.. | Debate of Secretariat employees,TNJO's | Sakshi
Sakshi News home page

తోపులాట..

Jul 6 2017 12:51 AM | Updated on Sep 5 2017 3:17 PM

తోపులాట..

తోపులాట..

రోజు మాదిరిగానే సచివాలయంలో ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు.

సచివాలయంలో సెక్రటేరియట్‌ ఉద్యోగులు– టీఎన్జీవోల బాహాబాహీ
 
సాక్షి, హైదరాబాద్‌: రోజు మాదిరిగానే సచివాలయంలో ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు.  మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా అరుపులు వినపడటంతో ఉద్యోగులు బయటకొచ్చి జరిగింది చూసి ముక్కన వేలేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఆరు నెలల క్రితం ఏపీ స్థానికత ఉన్న 24 మంది సెక్షన్‌ ఆఫీసర్లను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్‌ చేసింది. వారిని ఏపీ ప్రభుత్వం చేర్చుకోకపోవడంతో తిరిగి తెలంగాణకు వచ్చే ప్రయత్నంలో ఉన్న ఆ ఆఫీసర్లతో సచివాలయం లో టీఎన్జీవోలు సమావేశం ఏర్పాటు చేశారు.

తమకు తెలియకుండా సచివాలయంలో ఎలా సమావేశమవు తారంటూ టీఎన్జీవోల మీటింగ్‌ను సచివాలయ ఉద్యోగులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాటతో ఉద్రిక్తత నెలకొంది. తెలం గాణ సచివాలయ ఉద్యోగుల నేత ప్రోద్బలంతోనే ఏపీ అధికారులు దొడ్డిదారిలో తిరిగి రాష్ట్ర సచివాలయం లో చేరేందుకు పావులు కదుపుతున్నారని, అందుకే తమ మీటింగ్‌ను సచివాలయ ఉద్యోగులు అడ్డుకున్నా రని టీఎన్జీవో నేతలు ఆరోపించారు. దీనిపై పరస్పరం ఇరు వర్గాలు సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. ఈ çఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని టీఎన్జీవో నేతలు కారం రవీందర్‌రెడ్డి, మామిళ్ల రాజేందర్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement