'ప్రసాద్లో మంచి ఎనర్జీ ఉంది' | Dasari narayana rao condolence to actor ahuti prasad dead | Sakshi
Sakshi News home page

'ప్రసాద్లో మంచి ఎనర్జీ ఉంది'

Jan 4 2015 1:29 PM | Updated on Sep 2 2017 7:13 PM

'ప్రసాద్లో మంచి ఎనర్జీ ఉంది'

'ప్రసాద్లో మంచి ఎనర్జీ ఉంది'

ఆహుతి ప్రసాద్ మంచి ఫ్యూచర్ ఉన్న నటుడని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు.

హైదరాబాద్: ఆహుతి ప్రసాద్ మంచి ఫ్యూచర్ ఉన్న నటుడని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. అలాంటి నటుడిని తమ నుంచి, పరిశ్రమ నుంచి భగవంతుడు ఈ విధంగా తీసుకుపోతాడని అనుకోలేదన్నారు. ప్రసాద్లో మంచి ఎనర్జీ ఉందన్నారు. గోదావరి జిల్లాల భాషను మాట్లాడటంలో ఇప్పుడు ఉన్న నటుల్లో  ప్రసాద్ ఒక్కరని గుర్తు చేశారు.

ప్రభుత్వం నుంచి రెండు సార్లు నంది అవార్డు అందుకున్నారని చెప్పారు. ప్రసాద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే వాటిని ఎలా పరిష్కరించాలో సూచించాలని తనను ఆహుతి ప్రసాద్ తనను కోరే వాడని దాసరి ఈ సందర్భంగా వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement