టీఆర్ఎస్ ఏజెంట్ల్లా పోలీసులు: దానం | danam nagendar takes on trs government | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ ఏజెంట్ల్లా పోలీసులు: దానం

Feb 7 2015 10:35 AM | Updated on Mar 18 2019 7:55 PM

టీఆర్ఎస్ ఏజెంట్ల్లా పోలీసులు: దానం - Sakshi

టీఆర్ఎస్ ఏజెంట్ల్లా పోలీసులు: దానం

పోలీసులు టీఆర్ఎస్ ఏజెంట్లులా వ్యవహరిస్తున్నారని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ ఆరోపించారు.

హైదరాబాద్ : పోలీసులు టీఆర్ఎస్ ఏజెంట్లులా వ్యవహరిస్తున్నారని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో టీఆర్ఎస్ కార్యక్రమాలన్నింటికీ అనుమతులు ఇచ్చామని ఆయన శనివారమిక్కడ అన్నారు. కాంగ్రెస్ పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఛాతీ ఆస్పత్రిని తరలిస్తే రోగులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడుతుందని దానం అన్నారు.

కాగా  సచివాలయం, చెస్ట్‌ ఆస్పత్రి తరలింపును నిరసిస్తూ టీపీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ఇవాళ పాదయాత్రకు సిద్ధమైంది. గాంధీభవన్‌ నుంచి రాజ్‌భవన్‌ వరకు పాదయాత్ర చేసి గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. అయితే పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement