బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్ | cricket betting gang arrested | Sakshi
Sakshi News home page

బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్

Feb 22 2015 10:13 PM | Updated on Sep 2 2017 9:44 PM

బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్

బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ క్రైం: క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం నగరంలో జరిపిన పలు దాడుల్లో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. బహదూర్‌పూరాలో బెట్టింగ్ స్థావరాలపై దాడి చేసిన పోలీసులు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 10 మొబైల్‌ఫోన్లు, నగదు రూ. 51,000, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని షహీయానాద్ గంజ్‌లో బెట్టింగ్‌కు పాల్పడుతున్న బుకీ యోగేష్‌ను వెస్ట్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.9,500, ఒక టీవీ, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement