రెండేళ్ల చిన్నారిని కారులో వదిలేసి తల్లిదండ్రులు టిఫిన్ చేసేందుకు వెళ్లిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్డులో బుధవారం చోటుచేసుకుంది.
హైదరాబాద్ : రెండేళ్ల చిన్నారిని కారులో వదిలేసి తల్లిదండ్రులు టిఫిన్ చేసేందుకు వెళ్లిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్డులో బుధవారం చోటుచేసుకుంది. పాప నిద్రపోవడంతో కారులోనే ఉంచి తల్లిదండ్రులు టిఫిన్ చేసేందుకు వెళ్లారు. అయితే రోడ్డు పక్కన పార్క్ చేసిన కారులో చిన్నారి ఉండటాన్ని స్థానికులు గమనించి ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు.
మరోవైపు కారు అద్దాలు మూసి ఉండటంతో పాటు తల్లిదండ్రులు కనిపించకపోవడంతో చిన్నారి ఏడుపు మొదలుపెట్టింది. దీంతో పోలీసులు స్థానికుల సాయంతో అతికష్టం మీద కారు అద్దాలు పగులగొట్టి పాపను బయటకు తీశారు. పాప క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అశ్రద్ధగా చిన్నారిని వదిలివెళ్లిన తల్లిదండ్రులపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, నిద్రపోయిన పాపను లేపడం ఇష్టం లేకే కారులో ఉంచి వెళ్లామని వారు చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ స్థానికులు వారి చర్యపై వారి చర్యపై మండిపడ్డారు.