బతుకమ్మ విజయవంతానికి సహకారం | Contribution to Bathukamma Success | Sakshi
Sakshi News home page

బతుకమ్మ విజయవంతానికి సహకారం

Sep 9 2017 3:41 AM | Updated on Aug 11 2018 7:38 PM

బతుకమ్మ విజయవంతానికి సహకారం - Sakshi

బతుకమ్మ విజయవంతానికి సహకారం

బతుకమ్మ పండుగ విజయవంతానికి తెలంగాణ జాగృతి సంస్థ సహకారం అందిస్తుందని ఎంపీ కవిత తెలిపారు.

నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే బతుకమ్మ పండుగ విజయవంతానికి తమ సంస్థ సహకారం అందిస్తుందని, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ నెల 26న హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో జరిగే మహా బతుకమ్మ వేడుకను విజయవంతం చేసేందుకు తెలంగాణ జాగృతి కార్యకర్తలు కృషి చేస్తారని చెప్పారు. మహా బతుకమ్మలో పాల్గొనేందుకు మహిళలు వేలాదిగా తరలిరావాలని కవిత పిలుపునిచ్చారు.ఈ మేరకు ఆమె శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

పూలపండుగ పరిమళాలను, విశిష్టతను ప్రపంచానికి తెలియజేసేందుకు తెలంగాణకే పరిమితం అయిన బతుకమ్మ పండుగను ఖండాంతరాలకు వ్యాపింపచేయడంలో తెలంగాణ జాగృతి విశేష కృషి చేసిందన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోందని, తెలంగాణ జాగృతి కూడా ఈ సంబరాల్లో పాలుపంచుకుని విజయవంతం చేస్తోం దన్నారు. సాంస్కృతిక శాఖ ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో నిర్వహించే బతుకమ్మ సంబురాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ జాగృతి కార్యకర్తలు విజయవంతం చేస్తారని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement