మహిళ నుంచి డబ్బులు డిమాండ్ చేసిన ఇద్దరు కానిస్టేబుళ్ల పై పోలీసు శాఖ చర్యలు తీసుకుంది.
వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళ నుంచి డబ్బులు డిమాండ్ చేసిన ఇద్దరు కానిస్టేబుళ్ల పై పోలీసు శాఖ చర్యలు తీసుకుంది. సైబరాబాద్ పరిధిలో నివాసముంటున్న ఓ సెక్స్ వర్కర్ నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లు డబ్బులు వసూలు చేశారు. ఈ అంశంపై బాధితురాలు సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసింది. దీంతో దీంతో రంగంలోకి దిగిన రాజేంద్రనగర్ పోలీసులు దర్యప్తు చేసి ఇద్దరు కానిస్టేబుళ్లను బుధవారం అరెస్ట్ చేశారు.