'ఆ వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెంపపెట్టు' | congress mlc ponguleti sudhakar reddy slams cm kcr over irrigation projects | Sakshi
Sakshi News home page

'ఆ వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెంపపెట్టు'

Nov 23 2016 5:12 PM | Updated on Aug 14 2018 10:54 AM

'ఆ వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెంపపెట్టు' - Sakshi

'ఆ వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెంపపెట్టు'

భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించొద్దని హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు.

హైదరాబాద్‌ : భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించొద్దని హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ ప్రభుత్వానికి మరో చెంపపెట్టు అని ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు.

హైదరాబాద్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..టీఆర్‌ఎస్ నేతలు సెక్షన్-40కి కూడా వక్రభాష్యం చెబుతున్నారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు అనుమతి లేదని కేంద్ర మంత్రి, పార్లమెంటు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుకు చేశారు. ఈ విషయంలో కేసీఆర్ లాబీయింగ్ ఏమైందని ప్రశ్నించారు. మోదీతో ప్రేమ సంబంధాలు ఏమయ్యాయని ఎద్దేవా చేశారు.

రాష్ట్రం తన జాగీరులా కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తిగా గాలికొదిలేశారని, పోలవరం నిర్మాణంపై కేసీఆర్ ఎందుకు నోరుమెదపరో ప్రజలకు సమాధానం చెప్పాలని ధ్వజమెత్తారు. ముంపు మండలాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్రంలో మోదీ..రాష్ట్రంలో కేసీఆర్ ప్రజా ప్రయోజనాలు కాపాడటంలో విఫలమయ్యారని  పొంగులేటి విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement