త్వరలో వర్సిటీలకు ఛాన్స్‌లర్లు, వీసీలు! | cm kcr concentrated on vc's appoint to universities | Sakshi
Sakshi News home page

త్వరలో వర్సిటీలకు ఛాన్స్‌లర్లు, వీసీలు!

Apr 22 2016 2:46 AM | Updated on Aug 14 2018 10:54 AM

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న వైస్ ఛాన్స్‌లర్ పోస్టులతోపాటు ప్రభుత్వం నియమించాలనుకుంటున్న ఛాన్స్‌లర్ పోస్టుల భర్తీపై ప్రభుత ్వం దృష్టి సారించింది.

నియామకాలపై సీఎం దృష్టి
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న వైస్ ఛాన్స్‌లర్ పోస్టులతోపాటు ప్రభుత్వం నియమించాలనుకుంటున్న ఛాన్స్‌లర్ పోస్టుల భర్తీపై ప్రభుత ్వం దృష్టి సారించింది. త్వరలోనే ఆ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతోంది. గురువారం సీఎం కేసీఆర్ ఈ అంశంపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో చర్చించారు. ఈ సందర్భంగా వీసీలు, ఛాన్స్‌లర్ల నియామకాలకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే వర్సిటీల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కూడా చేపట్టాలని అనుకున్నట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement