'ఏ సీఎం కూడా కేసీఆర్లా అంచనా వేయలేదు' | cm kcr clearly observed budget bofore made: eatela rajender | Sakshi
Sakshi News home page

'ఏ సీఎం కూడా కేసీఆర్లా అంచనా వేయలేదు'

Mar 14 2016 1:46 PM | Updated on Aug 11 2018 6:42 PM

'ఏ సీఎం కూడా కేసీఆర్లా అంచనా వేయలేదు' - Sakshi

'ఏ సీఎం కూడా కేసీఆర్లా అంచనా వేయలేదు'

వరుసగా మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రావడం తన అదృష్టం అని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్: వరుసగా మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రావడం తన అదృష్టం అని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. దశాబ్దాలపాటు కొనసాగిన వివక్ష, అన్యాయంపై అవిశ్రాంత పోరాటం చేసిప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని ఆయన అన్నారు. కొత్త అధ్యాయాన్ని లిఖించుకుంటున్న సందర్భంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించామన్నారు. సమగ్ర అధ్యయనంతో, పూర్తి సమాచారంతో రూపొందించిన అసలు సిసలు బడ్జెట్ ఇదే అని ఆయన చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఎంతో సహాయం చేస్తుందని ఆశించినా చివరకు నీళ్లు చల్లిందని, కేవలం రూ.450కోట్లుమాత్రమే ఇచ్చిందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు చేసిన తప్పిదాలకు నేటికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన చెప్పారు. అవసరం లేకపోయినా ఎన్నో పథకాలు అమలు చేయాల్సి వస్తుందని, దీనికి తోడు విద్యుత్ కొరతవంటి సమస్యలు రాష్ట్రాన్ని పీడిస్తున్నాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతీశాఖ పనితీరును స్వయంగా సమీక్షించారని, ఆయాశాఖల్లో వచ్చే ఆదాయం, ఖర్చు, ఫలితాలు బేరీజు వేశారని అన్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతగా సమీక్షించిన సందర్భం లేదన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement