కార్టూనిస్టు శంకర్కు కేసీఆర్ అభినందనలు | cm kcr appreciates sakshi cartoonist shankar | Sakshi
Sakshi News home page

కార్టూనిస్టు శంకర్కు కేసీఆర్ అభినందనలు

Oct 16 2014 4:17 PM | Updated on Aug 15 2018 9:22 PM

కార్టూనిస్టు శంకర్కు కేసీఆర్ అభినందనలు - Sakshi

కార్టూనిస్టు శంకర్కు కేసీఆర్ అభినందనలు

'సాక్షి' కార్టూనిస్టు శంకర్ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.

'సాక్షి' కార్టూనిస్టు శంకర్ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. కార్టూనిస్ట్ శంకర్కు ప్రపంచ ప్రఖ్యాత అవార్డు రావడం చాలా అభినందనీయమని ఆయన అన్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన కార్టూనిస్టు అంతర్జాతీయ అవార్డు పొందడం పట్ల తనకు సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.

పోర్చుగల్‌కు చెందిన వరల్డ్ ప్రెస్ కార్టూన్ సంస్థ ఏటా ప్రపంచ స్థాయిలో ఉత్తమ ఎడిటోరియల్ కార్టూన్లు, క్యారికేచర్లకు ప్రకటించే గ్రాండ్ ప్రి అవార్డు ఈ ఏడాది శంకర్ను వరించిన విషయం తెలిసిందే. 2014 సంవత్సరానికి దాదాపు 64 దేశాల నుంచి పోటీకి వచ్చిన ఎంట్రీల్లో శంకర్ గీసిన హక్కుల పోరాటయోధుడు నెల్సన్ మండేలా క్యారికేచర్ ఉత్తమ ఎంట్రీగా ఎంపికైంది.

Advertisement
 
Advertisement
Advertisement