టీడీపీ తలుచుకుంటే ‘సాక్షి’ భూ స్థాపితమే | Civil Supplies Corporation Chairman Linga reddy comments on sakshi | Sakshi
Sakshi News home page

టీడీపీ తలుచుకుంటే ‘సాక్షి’ భూ స్థాపితమే

Apr 5 2016 1:14 AM | Updated on Aug 20 2018 8:20 PM

టీడీపీ తలుచుకుంటే ‘సాక్షి’ భూ స్థాపితమే - Sakshi

టీడీపీ తలుచుకుంటే ‘సాక్షి’ భూ స్థాపితమే

కడప జిల్లా పౌరసరఫరాల అధికారి(డీఎస్‌ఓ)ని తాను దూషించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మల్లేల లింగారెడ్డి అన్నారు.

పౌరసరఫరాల సంస్థ చైర్మన్ లింగారెడ్డి చిందులు

 సాక్షి, హైదరాబాద్: కడప జిల్లా పౌరసరఫరాల అధికారి(డీఎస్‌ఓ)ని తాను దూషించినట్లు వచ్చిన వార్తల్లో నిజంలేదని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మల్లేల లింగారెడ్డి అన్నారు. పరిటాల రవి హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న వ్యక్తి రేషన్ దుకాణం నిర్వహిస్తూ అక్రమాలకు పాల్పడటంపై మాత్రమే డీఎస్‌ఓను ప్రశ్నించానని ఆయన పేర్కొన్నారు.

సోమవారం సచివాలయంలోని మీడియా పాయింట్‌లో లింగారెడ్డి మాట్లాడుతూ ‘సాక్షి’ మీడియాపై అక్కసు వెళ్లగక్కారు. డీఎస్‌ఓను తాను దూషించినట్లు నిరూపించలేకపోతే ‘సాక్షి’పై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలు, తాను తలచుకుంటే ‘సాక్షి’ని భూ స్థాపితం చేస్తామని చిందులు తొక్కారు. ఎవరినో నమ్మి ఆందోళనలకు దిగడం మంచిది కాదని ఉద్యోగ సంఘాలను పరోక్షంగాహెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement