నగరంలో దుండగుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఇంట్లోకి చొరబడి అందినకాడికి దోచుకెళ్లడం, ఆపై అడ్డుకున్నవారిని అతిదారుణంగా హతమారుస్తున్నారు. ఇలాంటి ఘటనలు నగరంలో ఏదో చోట నిత్యం వెలుగుచూస్తునే ఉన్నాయి.
హైదరాబాద్: నగరంలో దుండగుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఇంట్లోకి చొరబడి అందినకాడికి దోచుకెళ్లడం, ఆపై అడ్డుకున్నవారిని అతిదారుణంగా హతమారుస్తున్నారు. ఇలాంటి ఘటనలు నగరంలో ఏదో చోట నిత్యం వెలుగుచూస్తునే ఉన్నాయి.
తాజాగా ఎల్బీనగర్‌లో సాయినగర్‌లో బుధవారం దొంగలు సృష్టించిన బీభత్సానికి వృద్ధ దంపతులు బలైయ్యారు. ఆ దంపతుల ఇంట్లోకి పోలీసులమంటూ నలుగురు దుండగులు ప్రవేశించి విచక్షణ లేకుండా దారుణంగా హత్యచేశారు. దంపతులను హత్యచేసిన వారిలో ఇద్దరు దొంగలను పట్టుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. కాగా, వారిలో మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు సమాచారం.