వ్యవసాయం, అనుబంధ రంగాల బడ్జెట్ ప్రతిపాదనలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్: వ్యవసాయం, అనుబంధ రంగాల బడ్జెట్ ప్రతిపాదనలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో బడ్జెట్ తయారీలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మూస పద్దతులు పోవాలని కేసీఆర్ అన్నారు.
రైతులను ఆదుకునే విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులను మళ్లించాలని చెప్పారు. బడ్జెట్‌లో వ్యవసాయానికి కేంద్రం తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని కేసీఆర్ పేర్కొన్నారు.