ఐటీ అధికారి ఇంటిపై సీబీఐ దాడులు | Sakshi
Sakshi News home page

ఐటీ అధికారి ఇంటిపై సీబీఐ దాడులు

Published Fri, Dec 2 2016 3:50 AM

ఐటీ అధికారి ఇంటిపై సీబీఐ దాడులు - Sakshi

 కొండాపూర్ (రేంజ్-3) అధికారిగా పనిచేస్తున్న బీవీ రావు 
 కూకట్‌పల్లి నివాసంలో సోదాలు... కేసు నమోదు 
 
 సాక్షి, హైదరాబాద్: ఆదాయపు పన్ను శాఖలో కొండాపూర్ (రేంజ్-3) అధికారి బొద్దు వెంకటేశ్వరరావు ఇంటిపై సీబీఐ గురువారం దాడులు చేసింది. కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డ్ కాలనీ ఫేజ్-9లో ఉన్న ఆయన ఇంట్లో సీబీఐ ప్రత్యేక బృందం సోదాలు నిర్వహించి, కేసు నమోదు చేసింది. అధికార దుర్వినియోగం, లంచాలతో భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ దీన్ని రిజిస్టర్ చేసింది. బీవీ రావుగా పిలిచే వెంకటేశ్వరరావుకు సంబంధించి 2010 ఏప్రిల్ 1- 2016 అక్టోబర్ 31 మధ్య ప్రకటిత ఆదాయం దాదాపు రూ.97.02 లక్షలుగా సీబీఐ తేల్చింది. ఈ కాలంలో ఆయన ఖర్చులు రూ.28,63,495గా నిర్ధారించింది. 
 
 ఇవిపోగా ఆయన వద్ద నగదు, స్థిరచరాస్తుల రూపంలో రూ.68,38,505 మాత్రమే ఉండాల్సి ఉండగా... ప్రస్తుతం ఆయన వద్ద ఉన్న వాటి విలువ రూ. 2,78,68,000గా అధికారులు లెక్కగట్టారు. ఎలాంటి ఆదాయం లేని రావు పెద్ద కుమారుడు ‘సప్తవర్ణ క్రియేషన్‌‌స’పేరుతో ఓ సినీ నిర్మాణ సంస్థను కలిగి ఉన్నాడని, 2014లో ఆయన చిన్న కుమారుడు హీరోగా ‘ఐయామ్ ఇన్ లవ్’చిత్రాన్ని తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో నిర్మిం చారని సీబీఐ పేర్కొంది. దీనికి రూ.1.8 కోట్లు ఖర్చయినట్లు తెలిపింది. మొత్తమ్మీద బీవీ రావు 212.64 శాతం ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు లెక్కకట్టింది. కేపీ హెచ్‌బీలో 637.37 చ.అడుగుల విస్తీర్ణంలో ఇల్లు, కొండాపూర్‌లో ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించింది. రావుపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 
 
 

Advertisement
Advertisement