ప్రేమించమంటూ బాలికను బెదిరిస్తున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు
హైదరాబాద్: ప్రేమించమంటూ బాలికను బెదిరిస్తున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్‌బీనగర్ ఎస్‌ఐ అబ్దుల్ అలీ తెలిపిన వివరాల ప్రకారం... బండ్లగూడ కృషి నగర్‌కు చెందిన బాలిక(17)ను అజయ్‌నగర్ కాలనీకి చెందిన డేరింగుల మల్లికార్జున్ (20) కొంతకాలంగా వేధిస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంటికి వచ్చి యువతి అన్న ఇమ్రాన్‌ను బెదిరించాడు. దీంతో బాధితులు ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మల్లికార్జున్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.