అధ్యాపకుడిపై చేయి చేసుకున్న విద్యార్థి | case filed against lecturer and student in sr nagar police station | Sakshi
Sakshi News home page

అధ్యాపకుడిపై చేయి చేసుకున్న విద్యార్థి

Aug 26 2014 8:32 AM | Updated on Nov 9 2018 5:02 PM

కళాశాలకు ఆలస్యంగా వస్తున్నావేమిటని అడిగిన పాపానికి అధ్యాపకుడిపై విద్యార్థి చేయి చేసుకున్నాడు.

సంజీవరెడ్డినగర్: కళాశాలకు ఆలస్యంగా వస్తున్నావేమిటని అడిగిన పాపానికి అధ్యాపకుడిపై విద్యార్థి చేయి చేసుకున్నాడు. అధ్యాపకుడు నెట్టి వేయడంతో కిందపడిపోయిన విద్యార్థికి గాయాలయ్యాయి. ఇద్దరూ పరస్పరం ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్‌ఐ సుదర్శన్‌రెడ్డి కథనం ప్రకారం... కార్మికనగర్ సమీపంలోని బ్రహ్మశంకర్‌నగర్‌కు చెందిన నర్సింహ కుమారుడు ఎస్‌ఆర్‌నగర్‌లోని లెజెండ్ సీఎ కళాశాలలో చదువుతున్నాడు. సోమవారం ఉదయం కాలేజీకి ఆలస్యంగా వచ్చిన అతడిని అధ్యాపకుడు యాడం తరుచూ ఎందుకు ఆలస్యంగా వస్తున్నావని నిలదీశాడు.

దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన విద్యార్థి లెక్చరర్ యాడంపై చేయి చేసుకున్నాడు. ఆయన నెట్టివేయడంతో కిందపడిన విద్యార్థికి స్పల్పగాయాలయ్యాయి. ఈ విషయం అతను తన తండ్రి నర్సింహకు చెప్పడంతో అతను కళాశాలకు వచ్చి గొడపడి.. లెక్చరర్‌పై చేయి చేసుకున్నాడు.  దీంతో కళాశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇరువురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement