
కుప్పకూలిన భవనం : పలువురికి గాయాలు
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 33లో నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.
జూబ్లీహిల్స్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌కు చెందిన భవనం కూలిన దుర్ఘటన మరువక ముందే మరోసారి అదే ప్రాంతంలో మరో భవనం కుప్పకూలింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 33లో శనివారం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడే పని చేస్తున్న 8 మంది కూలీలకు గాయాలయ్యాయి. రెండో అంతస్తు శ్లాబ్ నిర్మిస్తుండగా ప్రమాదం సంభవించింది. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. భవన నిర్మాణంలో లోపాల కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.