విరబూసిన బ్రహ్మకమలం | brhma kamalam flowered in a home in manikonda | Sakshi
Sakshi News home page

విరబూసిన బ్రహ్మకమలం

Jul 1 2015 11:12 PM | Updated on Sep 3 2017 4:41 AM

విరబూసిన బ్రహ్మకమలం

విరబూసిన బ్రహ్మకమలం

సంవత్సరానికి ఒకేసారి పూసే బ్రహ్మకమలం మణికొండలోని ఓ ఇంట్లో విరబూసింది. ఒకే సారి ఐదు పువ్వులు పూయడంతో స్థానికులు దాన్ని చూసేందుకు క్యూ కట్టారు

మణికొండ(హైదరాబాద్): సంవత్సరానికి ఒకేసారి పూసే బ్రహ్మకమలం మణికొండలోని ఓ ఇంట్లో విరబూసింది. ఒకే సారి ఐదు పువ్వులు పూయడంతో స్థానికులు దాన్ని చూసేందుకు క్యూ కట్టారు. మణికొండ పంచాయతీ పరిధిలోని సెక్రటేరియట్ కాలనీలో నివసిస్తున్న నీటి పారుదల శాఖ విశ్రాంత ఎస్‌ఈ ముప్పర కుమారరత్నం గత కొన్ని సంవత్సరాల క్రితం బ్రహ్మకమలం మొక్కను తెచ్చి పెంచుతున్నారు.

గత మూడు సంవత్సరాలుగా... ఏటా ఒకే పువ్వు పూయగా ఈ ఏడాది మాత్రం మంగళవారం అర్ధరాత్రి ఏకంగా ఐదు పువ్వులు పూసిందని ఆయన తెలిపారు. హిమాలయాల్లోనే ఉండే ఈమొక్క ఇంట్లో ఉంటే మంచిదని తెలపటంతో తెచ్చి పెంచుకుంటున్నామని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement