వారం రోజుల్లో చెప్పండి | board deadline given one week for krishna project | Sakshi
Sakshi News home page

వారం రోజుల్లో చెప్పండి

Jun 3 2016 3:12 AM | Updated on Sep 4 2017 1:30 AM

వారం రోజుల్లో చెప్పండి

వారం రోజుల్లో చెప్పండి

కృష్ణా నదీ బేసిన్‌లోని ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తెచ్చే అంశంపై అభిప్రాయం చెప్పేందుకు తెలంగాణకు కృష్ణా నదీయాజమాన్య బోర్డు వారం రోజులు గడువు పెట్టింది.

కృష్ణా ప్రాజెక్టుల పరిధిపై
10వ తేదీ వరకు బోర్డు డెడ్‌లైన్
లేదంటే బోర్డు మాన్యువల్‌ను ఆమోదిస్తున్నట్లుగా
పరిగణిస్తామని వెల్లడి

 సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్‌లోని ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తెచ్చే అంశంపై అభిప్రాయం చెప్పేందుకు తెలంగాణకు కృష్ణా నదీయాజమాన్య బోర్డు వారం రోజులు గడువు పెట్టింది. ఈ నెల 10వ తేదీలోగా రాష్ట్రం తన అభిప్రాయం చెప్పాలని సూచించింది. గడువులోగా అభిప్రాయం చెప్పకపోతే తాము తయారు చేసిన మాన్యువల్‌ను రాష్ట్రం అంగీకరిస్తున్నట్లుగా పరిగణించి, ఆ ప్రాజెక్టులను నోటిఫై చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు గత నెల 27న ఇరు రాష్ట్రాలతో సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మినిట్స్‌ను గురువారం తెలంగాణ ప్రభుత్వానికి పంపింది.

దీన్లో ప్రధానంగా ఉమ్మడి ప్రాజెక్టుల నియంత్రణ అంశాన్ని ప్రస్తావించింది. ఆ సమావేశంలో ప్రాజెక్టుల నిర్వహణపై రూపొందించిన మాన్యువల్‌ను ఇరు రాష్ట్రాలకు అందించింది. దాని ప్రకారం శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు కృష్ణా బోర్డు పరిధిలోకి వస్తాయి. హంద్రీ-నీవా, పోతిరెడ్డిపాడు, నెట్టెంపాడు, కోయల్‌సాగర్, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ, భీమా, ఏఎమ్మార్పీ వద్ద మెజరింగ్ పాయింట్లు కూడా బోర్డు నియంత్రణలో ఉంటాయి. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు, అందుకనుగుణంగా జారీ అయిన జీవోలు, రూపొందించిన నిబంధనల మేరకు నీటి వినియోగం ఉండేలా ఈ మాన్యువల్‌ను బోర్డు రూపొందించింది.

అయితే ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తెచ్చే యత్నాలను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అదీగాక బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎవరి వాటా ఎంత, వినియోగం ఎలా ఉండాలో చెప్పాకే బోర్డు నియంత్రణ అంశంపై నిర్ణయం తీసుకోవాలని చెబుతోంది. ఈ అంశాల్ని పేర్కొంటూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు గతంలోనే కేంద్ర మంత్రి ఉమాభారతికి లేఖలు రాశారు. అదలా ఉండగానే.. అభిప్రాయం చెప్పాలంటూ బోర్డు డెడ్‌లైన్ పెట్టడం తెలంగాణ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించేలా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement