పోలీసుల అదుపులో బ్లాక్మెయిల్ నిందితులు | Blackmail accused in the police control | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో బ్లాక్మెయిల్ నిందితులు

Oct 16 2016 2:10 PM | Updated on Sep 4 2018 5:24 PM

రియల్టర్‌ను తుపాకీతో బెదిరించిన ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శనివారం నగరంలోని అమీర్‌పేట్‌లో రియల్టర్‌ను తుపాకీతో బెదిరించిన ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్‌ఎస్ బ్రదర్స్ సమీపంలో నిన్న రియల్టర్ కిషోర్‌కుమార్ ను కొందరు దుండగులు తుపాకీతో బెదిరించారు. దీంతో భయబ్రాంతులకు గురైన కిషోర్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ సంఘటనతో సంబంధం ఉన్న కిషోర్ కుమార్ వ్యాపార భాగస్వాములు సృజన్, రాఘవేంద్రలతో పాటు మరో వ్యక్తిని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. 
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement