ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి అరెస్ట్‌ | BJP MLA kishan reddy arrested | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి అరెస్ట్‌

Sep 16 2017 1:28 PM | Updated on Sep 19 2017 4:39 PM

బీజేపీ ఫ్లోర్‌లీడర్‌ కిషన్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

హైదరాబాద్‌: హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు వినతి పత్రం అందించడానికి వెళ్తున్న బీజేపీ ఫ్లోర్‌లీడర్‌ కిషన్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హోంగార్డుల సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన అనంతరం హోంగార్డులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్‌ కమిషనర్‌కు వినతి పత్రం అందివ్వడానికి వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకొని అరెస్ట్‌ చేశారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న పలువురు హోంగార్డులను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడే నిర్బంధించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుంచి రాజధానికి వస్తున్న 120 మంది హోంగార్డులను అదుపులోకి తీసుకొని డీఎస్పీ ఆఫీస్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement