కింది కోర్టుల విభజన నిమిత్తం ఫిబ్రవరిలో జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితం గా అమలయ్యేలా చూడాలని తెలంగాణ..
ఏసీజేకు తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: కింది కోర్టుల విభజన నిమిత్తం ఫిబ్రవరిలో జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితం గా అమలయ్యేలా చూడాలని తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం, న్యాయవాదుల జేఏసీ బుధవారం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బొసాలేకు విజ్ఞప్తి చేశా యి. సంఘం అధ్యక్షుడు జి.మోహనరావు, జేఏసీ కన్వీనర్ రాజేందర్‌రెడ్డి నేతృత్వంలో న్యాయవాదులు ఏసీజేకు వినతిపత్రం సమర్పించారు. కింది స్థాయి న్యాయ వ్యవస్థ విభజన నిమిత్తం న్యాయాధికారుల నుంచి హైకోర్టు ఆప్షన్లు కోరిందని, ఇందుకు మార్గదర్శకాలూ జారీ చేసిందని వారు తెలిపారు. అయితే ఏపీకి చెందిన న్యాయాధికారులు తెలంగాణకు ఆప్షన్ ఇచ్చినట్లు తెలిసిందని, దీనివల్ల తెలంగాణ న్యాయాధికారులకు తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు.