రూ.10 నాణాలను తీసుకోని బ్యాంక్‌ | Bank manager who did not take Rs.10 coins | Sakshi
Sakshi News home page

రూ.10 నాణాలను తీసుకోని బ్యాంక్‌

May 12 2017 5:56 PM | Updated on Sep 4 2018 5:07 PM

రూ.10 నాణాలను తీసుకోని బ్యాంక్‌ - Sakshi

రూ.10 నాణాలను తీసుకోని బ్యాంక్‌

ఎస్‌బీఐలో 10 రూపాయల నాణాలు మేనేజర్ తీసుకోలేదు.

హైదరాబాద్‌ సిటీ: శాలిగౌరారం ఎస్‌బీఐలో 10 రూపాయల నాణాలు మేనేజర్ తీసుకోకపోవడంతో బ్యాంకు గేటు వద్ద  పడాల నారాయణ అనే వ్యక్తి నిరసనకు దిగాడు. రిజర్వ్‌ బ్యాంకు  నాణాలు చెల్లుతాయి అని చెప్పినా ఎందుకు తీసుకోవడం లేదని బ్యాంక్‌ మేనేజర్‌ను ప్రశ్నించారు.

అయినా తీసుకోకుండా బ్యాంక్‌ మేనేజర్‌ తీవ్రంగా హెచ్చరించడంతో బ్యాంకు గేటు వద్ద ఆందోళనకు దిగాడు. బ్యాంకులే పది రూపాయల నాణేలను తీసుకోకపోతే సామాన్య జనం ఎలా తీసుకుంటారని పలువురు అలోచనలో పడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement