అప్పు తీర్చమని బ్యాంక్ మేనేజర్ ఒత్తిడి | Bank Manager pressure to venu | Sakshi
Sakshi News home page

అప్పు తీర్చమని బ్యాంక్ మేనేజర్ ఒత్తిడి

Dec 17 2014 4:25 AM | Updated on Sep 2 2017 6:16 PM

అప్పు తీర్చమని బ్యాంక్ మేనేజర్ ఒత్తిడి

అప్పు తీర్చమని బ్యాంక్ మేనేజర్ ఒత్తిడి

అప్పు తీర్చమని బ్యాంకు మేనేజర్ చేస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక ఒకరు పెట్రోల్ పోసుకుని..

పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మాహత్యాయత్నం

కుకునూరు: అప్పు తీర్చమని బ్యాంకు మేనేజర్ చేస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక ఒకరు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా కుక్కునూరులో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... స్థానిక ఏపీజీవీబీ బ్యాంకులో పరాంకుశం అనే వ్యక్తి వేణు ఫ్యాన్సీ దుకాణం కోసం ఆ బ్యాంకులో రూ.25 వేలు రుణం తీసుకున్నాడు. గతేడాది జనవరిలో తీసుకున్న రుణాన్ని ఇంతకుముందు ఉన్న బ్యాంకు అధికారులు ఈ ఏడాది రెన్యువల్ చేశారు.

ఇటీవల బాధ్యతలు తీసుకున్న మేనేజర్ తాతా అంకాల్ తరచూ వేణును పిలిచి రుణం తీర్చమని, లేకుంటే నోటీసులు పంపిస్తానని, ఇల్లు, దుకాణం జప్తు చేస్తానని హెచ్చరించాడు. దీంతో మనస్తాపానికి గురైన వేణు మంగళవారం బ్యాంకు వద్దకు వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. నిప్పటించుకునే సమయంలో అక్కడే ఉన్న పలు పార్టీల నాయకులు, రైతులు అడ్డుకున్నారు. స్థానికులు మేనేజర్‌తో వాదనకు దిగారు.

Advertisement
 
Advertisement
Advertisement