చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇచ్చిన కేసీఆర్ | Appointment fixed for chandrababu naidu with telangana cm kcr | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇచ్చిన కేసీఆర్

Oct 17 2015 4:40 PM | Updated on Aug 15 2018 9:30 PM

చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇచ్చిన కేసీఆర్ - Sakshi

చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇచ్చిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు...ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు చంద్రబాబుకు...

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు...ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అపాయింట్మెంట్ ఇచ్చారు.  ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు చంద్రబాబుకు కేసీఆర్తో అపాయింట్మెంట్ ఖరారైంది. ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానపత్రం స్వయంగా అందించేందుకు కేసీఆర్ అపాయింట్మెంట్ కావాలని చంద్రబాబు నాయుడు కోరిన విషయం తెలిసిందే.

ఈ మేరకు తెలంగాణ సీఎం కార్యాలయానికి ఏపీ సీఎం కార్యాలయం సిబ్బంది ఫోన్ చేశారు. ఆదివారం సాయంత్రం తమకు కేసీఆర్ అపాయింట్మెంట్ కావాలని సిబ్బంది కోరారు. రాజధాని శంకుస్థాపనకు కేసీఆర్ను ఆహ్వానించేందుకు తాను స్వయంగా వెళ్తానని చంద్రబాబు ఇంతకుముందు చెప్పిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement