'దేవాలయాల పరిరక్షణను మేనిఫెస్టోలో చేర్చండి' | Sakshi
Sakshi News home page

'దేవాలయాల పరిరక్షణను మేనిఫెస్టోలో చేర్చండి'

Published Sat, Mar 29 2014 1:21 PM

AP Archaka Samakhya comittee Representatives meets ysrcp menifesto comittee

హైదరాబాద్ : హిందూ దేవాలయాల పరిరక్షణ, అర్చకుల సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రస్తావిస్తామని ఆపార్టీ సీనియర్ నేత మైసూరారెడ్డి తెలిపారు. దేవాదాయ, ధర్మాదాయ చట్టాన్ని అమలు చేస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అర్చక సమాఖ్య ప్రతినిధుల హామీని...పరిగణలోకి తీసుకున్నామని మైసూరారెడ్డి తెలిపారు.

అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ప్రతినిధుల బృందం శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మ్యానిఫెస్టో కమిటీ ప్రతినిధులను కలిశారు. ఈ సందర్భంగా వారు దేవాదాయ, ధర్మాదాయ చట్టం అమలును...వైఎస్ఆర్ సీపీ మ్యానిఫెస్టోలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ చట్టాన్ని అమలు చేశారని ఏపీ అర్చక సమాఖ్య ఉపాధ్యక్షుడు సౌందర రాజన్‌ గుర్తు చేశారు.

Advertisement
Advertisement