లారెన్స్‌కు ముందస్తు బెయిల్ | Anticipatory bail to Raghava Lawrence | Sakshi
Sakshi News home page

లారెన్స్‌కు ముందస్తు బెయిల్

Nov 10 2014 1:02 AM | Updated on Sep 2 2017 4:09 PM

లారెన్స్‌కు ముందస్తు బెయిల్

లారెన్స్‌కు ముందస్తు బెయిల్

‘రెబల్’ చిత్ర వివాదంలో ఆ చిత్ర దర్శకుడు లారెన్స్ రాఘవకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

సాక్షి, హైదరాబాద్: ‘రెబల్’ చిత్ర వివాదంలో ఆ చిత్ర దర్శకుడు లారెన్స్ రాఘవకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సోమవారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాల్సిందిగా లారెన్స్‌ను ఆదేశించింది. రెబల్ చిత్రాన్ని రూ. 22.5 కోట్లతో నిర్మిస్తానని లారెన్స్ ఆ చిత్ర నిర్మాతలైన జె.భగవాన్, పుల్లారావులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. చిత్ర నిర్మాణ సమయంలో ఆ బడ్జెట్ రూ.40 కోట్లకు చేరింది. దీనికితోడు చిత్రం ఆశించిన రీతిలో ఆడక నిర్మాతలు నష్టపోయారు.

ఈ విషయంలో దర్శకుడికి, నిర్మాతలకు మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా కొంత మొత్తాన్ని తాను భరిస్తానని లారెన్స్ అంగీకరించాడు. అయితే డబ్బులడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ నిర్మాతలిరువురూ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లారెన్స్‌పై సెక్షన్ 406, 420 కింద కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి కోర్టు శనివారం లారెన్స్‌కు బెయిల్ మంజూరు చేసింది. సోమవారం సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాలని సూచించింది.

Advertisement
 
Advertisement
Advertisement