- నామినేషన్ల సమయంలో కూటమి అరాచకాలు
- వైఎస్సార్సీపీ అభ్యర్థి కొప్పుల రవికుమార్‌పై అక్రమ కేసు బనాయింపు
- రవికుమార్‌ను జైలుకు పంపిన పోలీసులు
- గురజాల కోర్టులో విచారణ
- పోలీసుల చర్యలను తప్పుబట్టిన గురజాల సివిల్ జడ్జి కోర్టు
- రేపు రవికుమార్‌తో నామినేషన్ దాఖలు చేయించాలంటూ ఆదేశాలు
- ఎటువంటి బెదిరింపు చర్యలకు పాల్పడవద్దని పోలీసులకు కోర్టు హెచ్చరిక
దాచేపల్లి(పల్నాడు జిల్లా): స్థానిక ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని ఒకవైపు దాడులు, మరొకవైపు అక్రమ కేసులతో అరాచక పాలన సాగిస్తున్నకూటమి ప్రభుత్వానికి గురజాల కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా చేసే కుట్రలో భాగంగా దాచేపల్లి నగర పంచాయతీ వైఎస్సార్సీపీ అభ్యర్థి కొప్పుల రవికుమార్‌పై అక్రమ కేసు బనాయించిన పోలీసుల్ని కోర్టు మందలించింది. రేపు రవికుమార్‌తో నామినేషన్ దాఖలు చేయించాలంటూ గురజాల కోర్టు ఆదేశించింది.
రవికుమార్‌పై బనాయించిన అక్రమ కేసుపై ఈ రోజు(శనివారం, అక్టోబర్ 17వ తేదీ) విచారణ చేపట్టిన గురజాల సివిల్ జడ్జి కోర్టు.. ముందు ఆయనతో నామినేషన్ దాఖలు చేయించాలంటూ స్పష్టం చేసింది. అదే సమయంలో నామినేషన్ వేసే సమయంలో కూడా రవికుమార్‌ను బెదిరించకూడదని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. రవికుమార్‌పై థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించకూడదని కూడా పేర్కొంది.
ఇదీ చదవండి: ఎంపీ చేతుల్లోంచి నామినేషన్ పేపర్లు లాక్కుని..


