సీజేపీ కీలక నేతల విడుదల.. కోర్టు పెట్టిన షరతు ఇదే! | Dont Breach Peace For 1 Year: Abhijeet Dipke Released By Court | Sakshi
Sakshi News home page

సీజేపీ కీలక నేతల విడుదల.. కోర్టు పెట్టిన షరతు ఇదే!

Oct 11 2026 10:45 AM | Updated on Oct 11 2026 10:58 AM

Dont Breach Peace For 1 Year: Abhijeet Dipke Released By Court

ఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలంటూ నిన్న (శనివారం) జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేపట్టాలనుకున్న సీజేపీ కీలక నేతలను అభిజీత్‌ దీప్కే, సౌరవ్‌ దాస్, అశుతోష్‌లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ (ఆదివారం) ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాలతో పోలీసుల నిర్బంధం నుంచి వారు విడుదలయ్యారు. ఏడాది పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదంటూ కోర్టు షరతు విధించిందని సీజేపీ తరఫు న్యాయవాది తెలిపారు.

మధ్యాహ్నం 2 గంటలకు సీజేపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల ఓటర్ల జాబితాలో అక్రమాలపై తమ నిరసనలను కొనసాగిస్తామని సీజేపీ స్పష్టం చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది.

జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద గుమిగూడాలంటూ సీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఢిల్లీలో పోలీసులు భారీ కట్టుదిట్ట చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సుమారు 3,000 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే తాజా నిరసనకు పార్టీ పిలుపునిచ్చింది. అదుపులోకి తీసుకున్న వారిలో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. వారిలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి చెందిన అరవింద్ కేజ్రీవాల్, తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపకురాలు మమతా బెనర్జీ, వామపక్ష నేతలు పినరయి విజయన్, మాణిక్ సర్కార్ ఉన్నారు.

ఇదీ చదవండి: దేశంలో అరాచకానికి విపక్షాల కుట్ర!

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement