'హరిత నగరాన్ని నిర్మిద్దాం' | Amala Akkineni chief guest in earth day function | Sakshi
Sakshi News home page

'హరిత నగరాన్ని నిర్మిద్దాం'

Apr 22 2015 11:52 PM | Updated on Sep 3 2017 12:41 AM

'హరిత నగరాన్ని నిర్మిద్దాం'

'హరిత నగరాన్ని నిర్మిద్దాం'

పరిశుభ్రమైన నగరాన్ని సృష్టించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని బ్లూక్రాస్ సొసైటీ నిర్వాహకురాలు, నటి అమల అక్కినేని పిలుపునిచ్చారు.

హైదరాబాద్ : పరిశుభ్రమైన నగరాన్ని సృష్టించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని బ్లూక్రాస్ సొసైటీ నిర్వాహకురాలు, నటి అమల అక్కినేని పిలుపునిచ్చారు. ఎర్త్‌డేను పురస్కరించుకొని బుధవారం బేగంపేట హరిత హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమల మట్లాడుతూ.. ప్రతి ఒక్కరు వారానికి రెండు గంటల పాటు పర్యావరణహిత కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఇంటింటికీ తిరిగి చెత్త సేకరిస్తున్న శుభ్రక్‌లకు ఈ సందర్భంగా అమల యూనిఫామ్ అందజేశారు.

కార్మికులకు బ్యాంక్ అకౌంట్‌లు తెరవడానికి కృషి చేస్తున్నట్లు ఎక్స్‌నోరా నిర్వాహకుడు మేజర్ శివకిరణ్ వెల్లడించారు. పర్యావరణం, పరిశుభ్రత కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు జూన్ 5న క్లీన్ ఇండియా గ్రీన్‌లీఫ్ అవార్డులను ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ పర్యావరణ, అడవుల శాఖ స్పెషల్ సెక్రటరీ ఎంసీ పరేగాన్, ప్రొఫెసర్ ప్రసన్నకుమార్, జ్యోతికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement