కౌన్సెలింగ్ తేదీలను తక్షణమే ప్రకటించాలంటూ విద్యార్ధులు బుధవారం ఆందోళనకు దిగారు.
హైదరాబాద్ : కౌన్సెలింగ్ తేదీలను తక్షణమే ప్రకటించాలంటూ విద్యార్ధులు బుధవారం ఆందోళనకు దిగారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు తెలంగాణ సచివాలయాన్ని ముట్టడికి యత్నించారు. అయితే పోలీసులు విద్యార్థులను మధ్యలోనే అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
విద్యార్థులు ఎంతో ఆశగా ఎదురు చేస్తున్న అన్ని కోర్సుల కౌన్సెలింగ్ తేదీలను ప్రభుత్వం ప్రకటించాలని, అలాగే ప్రకటించిన కౌన్సిలింగ్ తేదీలను వాయిదా వేయటం సరికాదన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.