
హైకోర్టు ఆవరణలో నిందితుడి ఆత్మహత్యాయత్నం
ఉమ్మడి హైకోర్టు ఆవరణలో శుక్రవారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఉమ్మడి హైకోర్టు ఆవరణలో శుక్రవారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. తన కేసు విచారణలో జరుతోన్న జాప్యాన్ని నిరసిస్తూ గచ్చిబౌలీకి చెందిన శంకర్.. కోర్టు ఆవరణలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడ్డ అతణ్ని పోలీసులు హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
అయితే విచారణ కోసం కోర్టుకు వచ్చిన శంకర్ కు కిరోసిన్ ఎవరిచ్చారనే విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు పాల్పడిన శంకర్ ఐక్య ప్రజా సంఘం ఆర్గనైజర్గా పనిచేశాడు.