
ఏసీబీ వలలో కమర్షియల్ టాక్స్ ఆఫీసర్
అవినీతి నిరోధక శాఖాధికారులకు మరో అవినీతి చేప చిక్కింది.
హైదరాబాద్‌సిటీ: అవినీతి నిరోధక శాఖాధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. నల్గొండ జిల్లా కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సయ్యద్ బాషా హుస్సేన్ రూ.లక్ష లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కాడు.
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో గ్రానైట్ లోడ్‌తో వెళ్తున్న 2 లారీలను పట్టుకుని 2 రోజులైనా వాటిపై ఎలాంటి కేసు నమోదు చేయకుండా ఉంచి రూ.లక్ష లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోనికి దిగిన నల్గొండ ఏసీబీ అధికారులు హుస్సేన్ లంచం తీసుకుంటుండగా పట్టుకుని అరెస్ట్ చేశారు.
వనస్థలిపురంలో నివాసముంటున్న భాషా ఇంటిపై మహబూబ్‌నగర్ ఏసీబీ డీఎస్పీ రామదాసు అతని బృందం కలిసి బుధవారం అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు. ఆయన ఇంట్లో రూ.7 లక్షల నగదు, 500 గ్రాముల బంగారం, 4 కిలోల వెండితో పాటు పలు భూ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. హుస్సేన్పై కేసు నమోదు చేసిన అధికారులు విచారిస్తున్నారు.