ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం | A man suicide attempt at mla maganti gopinath office | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Jan 3 2016 2:20 PM | Updated on Aug 10 2018 8:16 PM

ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం - Sakshi

ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆఫీస్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు.

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆఫీస్ ఎదుట ఆదివారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. కార్పొరేటర్ టిక్కెట్ ఇస్తానని తనని నమ్మించి మోసం చేశారని ముస్తాక్ షరీఫ్ అనే వ్యక్తి బలవన్మరణానికి యత్నించాడు. అక్కడున్న వారు ముస్తాక్ను ఆత్మహత్యకు పాల్పడకుండా అడ్డుకున్నారు.

ఈ విషయంపై ఎమ్మెల్యే గోపీనాథ్ను మీడియా సంప్రదించగా... ముస్తాక్ షరీఫ్ టీడీపీకి సంబంధించిన వ్యక్తికాదని వివరణ ఇచ్చారు. కేవలం 15 రోజుల కిందట టీడీపీలో చేరతానని ముస్తాక్ షరీష్ అనే వ్యక్తి తనను కలిశాడని గోపీనాథ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement