
మద్యం సేవిస్తున్న మైనర్లు అరెస్ట్
మద్యం సేవించే మైనర్ బాబులపై పోలీసులు నిఘా పెంచారు.
హైదరాబాద్ : మద్యం సేవించే మైనర్ బాబులపై పోలీసులు నిఘా పెంచారు. నగరంలోని వనస్థలిపురం బార్‌లపై శనివారం రాత్రి దాడులు నిర్వహించిన పోలీసులు మద్యం సేవిస్తున్న నలుగురు మైనర్‌లను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పర్మిషన్ లేని ప్రాంతంలో.. వైన్స్ ముందు బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న మరో 20 మంది యువకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.