
శంషాబాద్ వద్ద నలుగురు క్యాబ్ డ్రైవర్ల అరెస్ట్
హైదరాబాద్లో నలుగురు క్యాబ్ డ్రైవర్లు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.
హైదరాబాద్: హైదరాబాద్లో నలుగురు క్యాబ్ డ్రైవర్లు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పోలీసులు నలుగురినీ అరెస్ట్ చేశారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇటీవల క్యాబ్ డ్రైవర్ ఓ మహిళా ఉద్యోగిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి రావడంతో మరిన్ని భద్రత చర్యలు తీసుకుంటున్నారు. నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఉబెర్ క్యాబ్లను నిషేధించారు. హైదరాబాద్లో కూడా ఉబెర్ క్యాబ్లను నిషేధించారు.