నీలోఫర్ ఆస్పత్రి మరోసారి వార్తల్లోకెక్కింది. అయిదుగురు చిన్నారులకు..నర్సులు ఒకే సిరంజ్తో ఇంజెక్షన్ ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ : నీలోఫర్ ఆస్పత్రి మరోసారి వార్తల్లోకెక్కింది. అయిదుగురు చిన్నారులకు..నర్సులు ఒకే సిరంజ్తో ఇంజెక్షన్ ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిరంజ్ మార్చేందుకు నిర్లక్ష్యమో లేక బద్దకమో తెలియదు కానీ. ...అయిదేళ్ల లోపు చిన్నారులకు ఇంజెక్షన్ ఇచ్చేందుకు విధుల్లో ఉన్న నర్సులు ఒకే సిరంజ్ వాడారు. దాంతో చిన్నారులకు వైద్యం వికటించి... చేతులకు వాపులు రావటంతో వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
ఈ సంఘటనపై స్పందించిన సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం చిన్నారులకు వైద్యం అందిస్తున్నట్లు చెప్పిన వైద్యులు, చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. కాగా సుమారు 35మంది చిన్నారులకు ఒకే సిరంజ్ ద్వారా ఇంజెక్షన్లు చేసినట్లు సమాచారం.