24 గంటల కరెంటు బీజేపీ ఘనతే | 24 ​hours current credit to bjp | Sakshi
Sakshi News home page

24 గంటల కరెంటు బీజేపీ ఘనతే

Jan 3 2018 12:58 PM | Updated on Aug 20 2018 9:18 PM

24 ​hours current credit to bjp - Sakshi

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో నిరంతర విద్యుత్ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ఘనతేనని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు.  విలేకరులో మాట్లాడుతూ.. 2018 వరకు తెలంగాణలో నిరంతర విద్యుత్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. ఉదయ్ పథకంలో రాష్ట్రాన్ని చేర్చడం, నార్త్ సౌత్ గ్రిడ్‌ అనుసంధానం, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లకు కేంద్రం అనుమతులు ఇచ్చిందన్నారు. ఒక్క మెగావాట్ ఉత్పత్తి పెరగకుండా రాష్ట్రం  విద్యుత్‌ను ఎలా ఇస్తుందని ప్రశ్నించారు.

 2014 ముందు దేశంలో విద్యుత్ లోటు ఉందని, మోదీ ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో విద్యుత్ ఉత్పత్తి పెరిగిందన్నారు. మోదీ సర్కారు వచ్చాక 19 రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ ఏర్పడిందన్నారు. టీఆర్‌ఎస్‌ ఇది కేవలం రాష్ట్ర ఘనత అనడం విడ్డూరమన్నారు. 2019 లక్ష్యంగా బీజేపీ పని చేస్తోందని, అందులో భాగంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  కైలాష్ విజయ వర్గీయ 3 జిల్లాల్లో పర్యటించారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement