బ్యాగ్ హ్యాండిల్స్, సెల్ఫోన్ ఛార్జర్లలో బంగారం | 2 Kg gold seized in Shamshabad airport | Sakshi
Sakshi News home page

బ్యాగ్ హ్యాండిల్స్, సెల్ఫోన్ ఛార్జర్లలో బంగారం

Mar 5 2014 8:32 AM | Updated on Sep 2 2017 4:23 AM

బ్యాగ్ హ్యాండిల్స్, సెల్ఫోన్ ఛార్జర్లలో బంగారం

బ్యాగ్ హ్యాండిల్స్, సెల్ఫోన్ ఛార్జర్లలో బంగారం

శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల నుంచి రెండు కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు బుధవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్దంగా వీరంతా  బ్యాగ్ హ్యాండిల్స్, సెల్ఫోన్ ఛార్జర్లలో బంగారాన్ని తీసుకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. నలుగురు ప్రయాణికుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరంతా తమిళనాడుకు చెందినవారు.  నిన్న కూడా శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement