15రోజులకే నిండిన నూరెళ్లు.. | 15days Old child died in jeedimetla | Sakshi
Sakshi News home page

15రోజులకే నిండిన నూరెళ్లు..

Jan 12 2017 7:10 PM | Updated on Sep 29 2018 5:10 PM

తల్లి ఒడిలో జోలపాటలతో హాయిగా నిదురించవలసిన ఆ పసికందు మృతదేహమై నాలాలో పడిఉంది.

జీడిమెట్ల(హైదరాబాద్‌సిటీ): తల్లి ఒడిలో జోలపాటలతో హాయిగా నిదురించవలసిన ఆ పసికందు మృతదేహమై నాలాలో పడిఉంది. ఈ  ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కలకలం రేపింది. వివరాలు..షాపూర్‌నగర్‌ రైతు బజారు వద్ద గురువారం ఉదయం హమాలీ పని చేయడానికి వచ్చిన కూలీ మేషయ్య నాలాలో పడిఉన్న  పసికందు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు.

అక్కడికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పసిపాప కు 15 రోజుల వయసు ఉంటుందని మేషయ్య ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. సమీపంలో ఉన్న ఆస్పత్రుల్లో గడిచిన పదిహేను రోజుల్లో ఎవరెవరు ప్రసవించారన్న విషయాలపై ఆరా తీస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement