జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు 14 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు.
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు 14 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు. అంబర్‌పేట ఇన్‌స్పెక్టర్ రవీందర్‌రెడ్డి చెప్పిన వివరాల మేరకు.. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను శుక్రవారం పిలిపించి వారి రోజువారి కదలికలను అడిగి తెలుసుకున్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఇన్‌స్పెక్టర్ రవీందర్‌రెడ్డి హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి రౌడీషీటర్ కదలికలపై నిఘా వేసి ఎన్నికల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీస్టేషన్ పరిధిలో ఉన్న మొత్తం రౌడీషీటర్‌లను దశల వారిగా బైండోవర్ చేస్తామన్నారు.