డిగ్రీ కాలేజీల్లో 1,384 పోస్టులు | 1,384 posts in degree colleges | Sakshi
Sakshi News home page

డిగ్రీ కాలేజీల్లో 1,384 పోస్టులు

Apr 13 2018 1:49 AM | Updated on Apr 13 2018 1:49 AM

1,384 posts in degree colleges  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కొత్తగా 1,384 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 2008 కంటే ముందున్న పాత డిగ్రీ కాలేజీల్లో 374 పోస్టులు, 2008 తర్వాత ప్రారంభమైన 57 కొత్త కాలేజీల్లో 1,010 పోస్టులను మంజూరు చేస్తూ.. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

మొత్తం 115 కాలేజీల్లోని 1,384 పోస్టులకు సంబంధించి పేస్కేలు తదితర వివరాలనూ అందులో పేర్కొన్నారు. ఈ పోస్టుల్లో ప్రిన్సిపాల్‌ పోస్టులు 15, డిగ్రీ లెక్చరర్‌ 1,214, ఫిజికల్‌ డైరెక్టర్‌ 67, లైబ్రేరియన్‌ 64, అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ పోస్టులు 24 ఉన్నాయి.

పాలిటెక్నిక్‌లలో 199 లెక్చరర్‌ పోస్టులు: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 199 లెక్చరర్‌ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్, రామంతాపూర్, క్యూక్యూ ప్రభుత్వ కాలేజీలు, సికింద్రాబాద్‌లోని ఈస్ట్‌ మారేడ్‌పల్లి కాలేజీ, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, జహీరాబాద్, సిరిసిల్ల, నల్లగొండ, కొత్తగూడెం పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఈ పోస్టులను మంజూరు చేసింది. విభాగాల వారీగా పోస్టుల వివరాలను ఉత్తర్వుల్లో పొందుపరిచింది. 

Advertisement
 
Advertisement
Advertisement