మరో మూడు దేశాల్లో ‘108’ | 108 emergency services in another three countries | Sakshi
Sakshi News home page

మరో మూడు దేశాల్లో ‘108’

Aug 16 2015 1:00 PM | Updated on Sep 3 2017 7:33 AM

మరో మూడు దేశాల్లో  ‘108’

మరో మూడు దేశాల్లో ‘108’

మరో మూడు దేశాలకు ‘108’ అత్యవసర అంబులెన్స్ సేవలను విస్తరించనున్నట్లు జీవీకే-ఈఎంఆర్‌ఐ చైర్మన్ జీవీకే రెడ్డి వెల్లడించారు.

సాక్షి, హైదరాబాద్: మరో మూడు దేశాలకు ‘108’ అత్యవసర అంబులెన్స్ సేవలను విస్తరించనున్నట్లు జీవీకే-ఈఎంఆర్‌ఐ చైర్మన్ జీవీకే రెడ్డి వెల్లడించారు. శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండ్‌లలో ‘108’ వైద్య సేవలను విస్తరిస్తున్నామన్నారు. ‘108’ ప్రారంభమై పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ పదేళ్లలో 15 లక్షలమంది ప్రాణాలను కాపాడామన్నారు. ఈ ఏడాది చివరికి శ్రీలంకలో సేవలు ప్రారంభమవుతాయని, ఈ మేరకు ఆ దేశంతో ఒప్పందం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎయిర్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేసే యోచన ఉందన్నారు. తద్వారా రహదారి వసతిలేని మారుమూల గ్రామాల ప్రజలకూ అత్యవసర వైద్య సేవలు అందించడానికి వీలవుతుందన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement