'జర్నలిస్టులకు వందశాతం ప్రభుత్వ ఖర్చుతో ఇళ్లు' | 100 percent govt will spend for Journalists houses in Hyderabad | Sakshi
Sakshi News home page

'జర్నలిస్టులకు వందశాతం ప్రభుత్వ ఖర్చుతో ఇళ్లు'

Jan 29 2016 8:14 PM | Updated on Aug 15 2018 9:30 PM

హైదరాబాద్లో జర్నలిస్టులకు వందశాతం ప్రభుత్వ ఖర్చుతో ఇళ్లు కట్టిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌: హైదరాబాద్లో జర్నలిస్టులకు వందశాతం ప్రభుత్వ ఖర్చుతో ఇళ్లు కట్టిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. వంద ఎకరాల గేటెడ్‌ కమ్యూనిటీలో జర్నలిస్టులకు ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. శుక్రవారం జర్నలిస్టు సంఘాల నేతలతో ఆయన భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. రేపు(శనివారం) ఇళ్ల స్థలాలకు అనువైన స్థలం అధికారులు ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు. మార్చిలో జర్నలిస్టుల ఇళ్లకు శంకుస్థాపన చేసి.. ఏడాదిలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement