మావోయిస్టుల ప్రాబల్యం పూర్థిస్థాయిలో అరికడతామని డీఐజీ డి. మల్లారెడ్డి అన్నారు.
సుల్తానాబాద్: మావోయిస్టుల ప్రాబల్యం పూర్థిస్థాయిలో అరికడతామని డీఐజీ డి. మల్లారెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో బుధవారం రాత్రి పోలీస్‌స్టేషన్, సీఐ కార్యాలయం రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈసందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు పై విధంగా స్పందించారు.
మావోయిస్టుల్లో విద్యావంతులు కొందరు ఉన్నంత మాత్రాన అందరు విద్యావంతులు కాలేరని, మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిందని, పెరగలేదని చెప్పారు. పోలీస్ కానిస్టేబుల్ పదోన్నతులు త్వరలో కరీంనగర్‌లో చేపడతామని వరంగల్‌లో 130 మందికి మంగళవారం వరకు పదోన్నతులు పూర్తి చేశామని వివరించారు.
కానిస్టేబుల్స్ కొరత ఉందని ప్రశ్నించగా వచ్చే 3 ఏళ్లలో అన్ని భర్తీలు చేస్తామని చెప్పారు. ఏఆర్ నుండి ఏపీఎస్పీ, సివిల్‌లో మారడం వల్ల పదోన్నతుల సమస్య, కోర్టు సమస్యలు ఉండడంవల్లే పీసీలకు పదోన్నతులు ఆలస్యం అయినాయన్నారు. ఆయుధంతో తిరిగితే, హింసాయుతమార్గం యోగ్యం కాదన్నారు. కరీంనగర్ జిల్లా ప్రశాంతంగా ఉందన్నారు. సుల్తానాబాద్, రామగుండం, గోదావరిఖని, పోలీస్‌స్టేషన్‌లను పరిశీలించారు. ఆయన వెంట ఎస్పీ జోయల్‌డేవిస్, డీఎస్పీ మల్లారెడ్డి, సీఐతులా శ్రీనివాస్‌రావు, ఎసై్స ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది ఉన్నారు.